బాలకృష్ణ వందో చిత్రం ఎవరితో?

- February 24, 2016 , by Maagulf
బాలకృష్ణ వందో చిత్రం ఎవరితో?

నం దమూరి బాలకృష్ణ వందో చిత్రం ఎవరితో? ఎప్పుడు? ఆయన ఏ పాత్రలో కనిపించబోతున్నారు? ఇలా నందమూరి అభిమానుల మదిలో మెదిలే ప్రశ్నలెన్నో?! గత కొంత కాలంగా చాలామంది దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు బాలయ్య చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కృష్ణవంశీకి దక్కిందని తెలుస్తోంది. బాలకృష్ణ ఇదివరకెప్పుడూ చేయని ఓ వినూత్న పాత్ర... కృష్ణవంశీ సృష్టించారట. వందో చిత్రంలో బాలకృష్ణ రైతు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బాలకృష్ణ రైతు నాయకుడిగా పోరాటం చేస్తారని ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం.మేలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో చిత్రబృందం వెల్లడి చేసే అవకాశాలున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com