లాక్ డౌన్ సమయంలో కోవిడ్ రూల్ బ్రేక్ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- February 04, 2021
మస్కట్:లాక్ డౌన్ సమయంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ వ్యక్తికి జైలు శిక్ష పడింది. కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గతేడాది దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన విషయం తెలిసింది. అనంతరం నిబంధనలను సవరిస్తూ నైట్ కర్ఫ్యూని అమలులోకి తీసుకొచ్చింది ఒమన్ సుప్రీం కమిటీ. ఇలా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొన్ని నిబంధనలను కఠినతరం చేస్తూ..మరికొన్నింటిని సడలిస్తూ వచ్చింది. అయితే..ప్రజలు మాత్రం ఫేస్ మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించాలనే నిబంధనలను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.కానీ, కొందరు వ్యక్తులు సుప్రీం కమిటీ సూచనలు పట్టించుకోకుండా నిబంధనలు ఉల్లంఘించటంతో వారిపై అప్పట్లో కేసులు నమోదు చేశారు అధికారులు.అలా ఓ వ్యక్తిపై నమోదైన కేసు నార్త్ షర్ఖియా గవర్నరేట్ పరిధిలోని ప్రాథమిక కోర్టు ముందు విచారణకు వచ్చింది. కేసును విచారించిన కోర్టు నిందితుడు ఉల్లంఘనకు పాల్పడినట్లు నిర్ధారించి అతనికి జైలు శిక్షను ఖరారు చేసింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







