కోవిడ్ ఎఫెక్ట్: అజ్మన్ లో అర్ధరాత్రి తర్వాత హోటల్స్, కేఫ్ లు బంద్
- February 05, 2021
అజ్మన్ పరిధిలోని హోటల్స్, కేఫ్స్ సమయాలను కుదిస్తూ ఆర్ధికాభివృద్ధి అధికార విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఎట్టిపరిస్థితుల్లోని హోటల్స్, కేఫ్స్ మూసివేయాల్సిందేనని ఆదేశించింది. వినియోగదారులను అనుమతించొద్దని సూచించింది. అయితే..హోమ్ డెలివరీకి మాత్రం అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 5 నుంచి ఎమిరాతి పరిధిలోని అన్ని హోటళ్లు, కేఫ్ లు ఈ నిబంధన పాటించాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు యూఏఈ ఆరోగ్య శాఖ నిర్ణయం మేరకు పలు ఎమిరాతి పాలన యంత్రాంగాలు పలు రంగాలపై ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలె దుబాయ్ కూడా హోటల్స్, రెస్టారెంట్లను అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత మూసివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే బాటలో అజ్మన్ పాలన యంత్రాంగం కూడా హోటల్స్, కేఫ్స్ పై ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







