కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే జీతంలో కోత..ఉద్యోగులకు కువైట్ వార్నింగ్
- February 05, 2021
కువైట్ సిటీ:ప్రజా ఆరోగ్య భద్రత కోసం సుప్రీం కమిటీ సూచించిన మార్గనిర్దేశకాలు పాటించని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సర్వీస్ కమిషన్ హెచ్చరించింది. సివిల్ సర్వీస్ డిక్రిలోని ఆర్టికల్ 60 మేరకు ప్రజా ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ సూచించినట్లు ప్రతి ఉద్యోగి ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిందేనని ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. తొలిసారి ఉల్లంఘనకు పాల్పడితే వార్నింగ్ నోటీస్ ఇస్తామని, మళ్లీ అదే తప్పును కొనసాగిస్తే ఒక రోజు వేతనం కట్ చేస్తామని వివరించింది. మళ్లీ మళ్లీ నిబంధనలను ఉల్లంఘిస్తే జీతంలో కోతలు విధిస్తూనే ఉంటామని, గరిష్టంగా 15 రోజుల జీతాన్ని కట్ చేస్తామని వెల్లడించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







