భారత దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం...
- February 05, 2021
న్యూ ఢిల్లీ:రేపు( ఫిబ్రవరి 6తేదీన) దేశవ్యాప్తంగా రైతులు “చక్కా జామ్”(రహదారుల దిగ్బంధం) కార్యక్రమం నిర్వహించనున్నారు.కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారని రైతు సంఘాలు విమర్శలు చేశాయి.శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులు,రాష్ట్ర రహదారులను దిగ్బంధనం చేయనున్నాయి రైతు సంఘాలు.రైతుల ట్రాక్టర్ ల ర్యాలీ సందర్భంగా గత నెల 26న దేశ రాజధానిలో హింస చెలరేగిన నేపధ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు.సరిహద్దుల నుంచి రైతులు దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం.వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళనలను కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం పక్కా ఏర్పాట్లు చేసింది.అటు కనీస మద్ధతు ధరపై పార్లమెంట్ లో నేడు కేంద్రం ప్రకటన చేసే అవకాశం అంటూ జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది.రైతుల “చక్కా జామ్” నేపధ్యంలో నిన్న ప్రధానితో కేంద్ర మంత్రుల భేటీ జరిగింది. ఢిల్లీ పోలీసు కమిషనర్, ఇంటలిజెన్స్ ఛీఫ్ తో సమావేశమై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా. నిన్న సాయంత్రం కూడా పార్లమెంట్ లో అమిత్ షా నేతృత్వంలో అత్యంత ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







