ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి: రాచకొండ సీపీ మహేష్ భగవత్

- February 05, 2021 , by Maagulf
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి: రాచకొండ సీపీ మహేష్ భగవత్

హైదరాబాద్:రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్ బి నగర్ డివిజన్ పోలీస్ కుటుంబ సభ్యులకు మెడికవర్ హాస్పిటల్స్, స్మైల్ డెంటల్, మాక్సివిజన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ డివిజన్ పరిధిలోని సిబ్బందికి  ఎల్ బి నగర్ లోని కేకే ఫంక్షన్ హాల్ లో మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా రాచకొండ సిపి మహేష్ భగవత్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ.. రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో ఇది రెండవ క్యాంపు అని, మొదటిది క్యాంప్ మల్కాజిగిరి లో ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. రెండో క్యాంపు ఈ రోజు ఎల్ బి నగర్ లో నిర్వహిస్తున్నామని అన్నారు. తరవాత క్యాంపు యాదాద్రిలో కూడా ఏర్పాటు చేయటం జరిగుతుందని అన్నారు. ఇలా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే హెల్త్ చేకప్ క్యాంపులో ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది పాల్గొని అరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

సోమవారం నుండి రాచకొండ కమిషనరేట్ లో ఉన్న 6000 వేల మంది పోలీస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.  4 రోజుల్లో పూర్తిగా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తవుతుందన్నారు.

ఎవరికైనా ఇతర వ్యాధులు ఉంటే డాక్టర్ సలహా తీసుకోని వాక్సిన్ వేయించుకోవాలని సిబ్బందిని కోరారు. వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ నిబంధనలు SMS (Sanitizer
Mask Social distance) పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి, మెడికవర్ హాస్పిటల్ డా. విజయ్ కుమార్ రెడ్డి, డా. సతీష్, జీఎం రవి కుమార్, ఏజిఎం శ్రీధర్, స్మైల్ డెంటల్ హాస్పిటల్ డా.రవికాంత్, లోటస్ హాస్పిటల్ గైనకాలాగిస్ట్ డా. సునీత, మాక్స్ విజన్ ఐ ఆప్తమాలాజిస్ట్ ఇక్బాల్, పృథ్వి, సీనియర్ మేనేజర్ నరసింహ రెడ్డి, మహేందర్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సీహెచ్ భద్రా రెడ్డి, క్రిష్ణా రెడ్డి, విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలిసు సిబ్బంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com