హైదరాబాద్-మాల్దీవులకు గో-ఎయిర్ విమానం...
- February 05, 2021
హైదరాబాద్: ఇకపై హైదరాబాద్ నుంచి నేరుగా మాల్దీవులకు విమాన సర్వీసు నడపాలని గోఎయిర్ నిర్ణయించింది.ఈ నెల 11 నుంచి హైదరాబాద్ నుంచి మాల్దీవుల రాజధాని మాలే నగరానికి విమానం నడపనుంది. ఈ రెండు నగరాల మధ్య ఇదే తొలి డైరెక్ట్ విమాన సర్వీసు.ఈ విమాన సర్వీసు వారంలో నాలుగు రోజులు అందుబాటులో ఉంటుంది. సోమవారం, మంగళవారం, గురువారం,ఆదివారం హైదరాబాద్ నుంచి విమాన సర్వీసును తిప్పనున్నారు.
గో-ఎయిర్ ఈ రూట్లో తన ఎయిర్ బస్ ఏ320 నియో విమానాన్ని నడపనుంది.ఉదయం 11.30 గంటలకు హైదరాబాదులో బయల్దేరే ఈ విమానం మాలే కాలమానం ప్రకారం 1.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.తిరుగు ప్రయాణంలో స్థానిక కాలమానం ప్రకారం 2.30 గంటలకు మాలేలో బయల్దేరి 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం