బహ్రెయిన్ లో కోవిడ్ ఎఫెక్ట్...ఇండోర్ జిమ్ములు, స్విమ్మింగ్ పూల్స్ క్లోజ్
- February 06, 2021_1612586239.jpg)
మనామా:కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పలు చర్యలు చేపట్టింది బహ్రెయిన్ ప్రభుత్వం. టాస్క్ ఫోర్స్ సూచనల మేరకు ఈవెంట్లు, వేడుకలు, జిమ్ములు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగుల హజరుపై కొత్తగా మార్గనిర్దేశకాలను జారీ చేసింది. ఫిబ్రవరి 7 నుంచి 21 వరకు ఈ కొత్త మార్గనిర్దేశకాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. కొత్తగా జారీ చేసిన నిబంధనల మేరకు ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేములు, జిమ్ములను తాత్కాలికంగా మూసివేయాలని ప్రకటించింది. ఇండోర్ ఎక్సర్ సైజ్ క్లాసెస్ లపై కూడా నిషేధం విధించింది. అయితే..ఔట్ డోర్ జిమ్ములు, ఎక్సర్ సైజ్ క్లాసులు, క్రీడలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. అయితే..పూర్తి సామర్ధ్యంలో 30 శాతానికి మించకుండా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అలాగే 30 మంది కంటే ఎక్కువ మంది హజరయ్యే అన్ని రకాల వేడుకలను కూడా తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. చివరికి ఇళ్లలో చేసుకునే ప్రైవేట్ ఫంక్షన్లలో కూడా 30 మందికి మించి ఉండకూడదు.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!