'నాంది' ట్రైలర్‌ విడుదల‌ చేసిన మహేష్‌ ‌బాబు

- February 06, 2021 , by Maagulf
\'నాంది\' ట్రైలర్‌ విడుదల‌ చేసిన మహేష్‌ ‌బాబు

హైదరాబాద్:కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్న అల్ల‌రి న‌రేష్ ‘నాంది’ సినిమాతో వస్తున్నాడు. విజ‌య్ క‌న‌క‌మేడ‌ల చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హించారు. స‌తీశ్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ లాయ‌ర్ గా క‌నిపించ‌నుంది. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 19న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు చిత్రబృందం ప్రకటించింది. ప్రయోగాత్మక చిత్రాల‌తో ఆక‌ట్టుకునే న‌రేష్ ఇప్పుడు డిఫ‌రెంట్ స్టోరీ సినిమాతో వస్తున్నాడు. సినిమా ఫస్ట్ లుక్ తోనే ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాడు. టీజర్ లోను నరేష్ చెప్పే సంభాషణలు సినిమాపై ఆసక్తిని నెలకొల్పాయి. నాంది సినిమాలో క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సామాజిక అంశాలపై మంచి మెసేజ్ ఇచ్చే విధంగా కొన్ని సీన్స్ ఉంటాయట. ఇది ఇలా ఉంటే... ఈ మూవీ ట్రైలర్‌ ఇవాళ రిలీజ్‌ అయింది. ప్రిన్స్‌ మహేష్‌బాబు చేతుల మీదుగా నాంది మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ అయింది. ఇక ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. "అందరూ నా జీవితం ఇక్కడ అయిపోయింది అని అనుకుంటారు.. కానీ ఇప్పుడే మొదలైంది" అంటూ ట్రైలర్‌లో  అల్లరి నరేష్‌ ఇరగదీశాడు. ఇక మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలియాలంటే రిలీజ్‌ అయ్యే వరకు ఆగాల్సిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com