'రాధేశ్యామ్' ప్రీ లుక్ టీజర్
- February 06, 2021
హైదరాబాద్:ప్రేమికుడుగా రాధేశ్యామ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. యువీ కృష్ణంరాజు సమర్పణలో.. గోపీకృష్ణామూవీస్, యువీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వంశీ, ప్రమోద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' మూవీ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ఫస్ట్ లుక్ టీజర్ రానుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ప్రీ లుక్ టీజర్ ని రిలీజ్ చేసింది టీమ్.
ఈ ప్రీ లుక్ టీజర్ రెబల్ స్టార్ ఫాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుటుంది. 'ఓ పోరాట యోధుడిగా మీకు ప్రభాస్ తెలుసు.. ఇప్పుడు ఆయన హృదయం తెలుసుకునే సమయం వచ్చింది.. లవర్స్ డే రోజున మీరు నిజమైన ప్రేమని చూస్తారు..' అంటూ వచ్చే 30 సెకన్ల వీడియో.. నెక్ట్స్ వచ్చే టీజర్‌పై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. దీంతో టీజర్ ఫై అంచనాలు అమాంతం పెరిగాయి. ప్రీ లుక్ టీజర్ ఇలా ఉందంటే.. ఇక టీజర్ కేక పుట్టించేలా ఉండొచ్చు అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
యూరప్ నేపథ్యంలో సాగే వింటేజ్ లవ్‌స్టోరీగా 'జిల్' ఫేమ్ రాధాకృష్ణకుమార్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.వింటేజ్ వాతావరణం ఈ మూవీకే ప్రధాన హైలైట్ అని టాలీవుడ్ టాక్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీని అత్యధిక భాగం ఇటలీ నేపథ్యంలో చిత్రీకరించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు