కోవిడ్ టీకా చాలా సురక్షితం:టి.డీజీపీ మహేందర్ రెడ్డి
- February 06, 2021
హైదరాబాద్:కోవిడ్ టీకా చాలా సురక్షితమైందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు.శనివారం తిలక్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన కోవిడ్ వాక్సిన్ వేయించుకొని మీడియాతో మాట్లాడారు. కొవిడ్ టీకాపై అనుమానాలు, అపోహలు వద్దని సూచించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే కోవిడ్ టీకా వేయించుకున్నారని,ప్రస్తుతం పోలీసు సిబ్బంది సైతం వేయించుకుంటున్నారని గుర్తుచేశారు.
ప్రజల్లో భయాలు, అపోహలు తొలగించేందుకు పోలీసుశాఖ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. కరోనా వ్యాప్తి సమయంలో వైద్యులు, పోలీసులు ప్రాణాలకు ఎదురొడ్డి సేవలు అందించారని పేర్కొన్నారు.తొలిదశలో కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలో సామాన్య ప్రజలకు టీకా అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని









