రియాద్ లో ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించనున్న 24 ఇంటర్నేషనల్ కంపెనీలు
- February 06, 2021
రియాద్:అంతర్జాతీయ కంపెనీలను తమ వైపు ఆకర్షించాలన్న సౌదీ లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. సౌదీ రాజధాని రియాద్ లో తమ ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఏకంగా 24 అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు సౌదీ అధికార యంత్రాంగంతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాయి. రియాద్ లో ప్రాంతీయ కార్యాలయాలను ప్రారంభించనున్న ఇంటర్నేషనల్ కంపెనీల్లో పెప్సికో, టిమ్ హోర్టన్స్, బెచ్టెల్, బాష్, బోస్టన్ సైంటిఫిక్ వంటి మేటి సంస్థలు కూడా ఉన్నాయి. 2030 నాటికి ప్రపంచంలోని తొలి పది వాణిజ్య నగరాల్లో రియాద్ కు కూడా చోటు దక్కాలన్నది కింగ్డమ్ ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగానే అంతర్జాతీయ కంపెనీల కార్యాలయాల ఏర్పాటుకు సౌదీ సాదరంగా అహ్వానం పలుకుతోంది. ప్రస్తుత ఒప్పందం మేరకు 24 సంస్థల ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు ద్వారా జీతాలు, ఆఫీస్ నిర్వాహణ, మూలధన వ్యయం తరహా నిధులతో నేషనల్ ఎకనామికి 70 మిలియన్ల రియాల్స్ నిధులు సమకూరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







