మినిస్ట్రి, ప్రభుత్వ ఆఫీసులకు సందర్శకుల సంఖ్యను కుదించిన ఖతార్
- February 06, 2021
దోహా:కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన ఖతార్..లేటెస్ట్ గా మరో నిర్ణయం తీసుకుంది. వివిధ పనుల నిమిత్తం మంత్రుల కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సందర్శకుల సంఖ్యను కుదించింది. గతంలో కంటే కేవలం 30 శాతం మందికే అనుమతి ఉంటుందని స్పష్టత ఇచ్చింది. కొద్ది రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం..సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గల్ఫ్ దేశాలన్ని ఆంక్షలను కఠినతరం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఖతార్ కు మంత్రులు, ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే వారి సంఖ్యపై పరిమితి విధించింది. అయితే..దరఖాస్తులు, ఇతర సేవలను పొందాలనుకునే వారు హాట్ లైన్ 16008కి కాల్ చేసి తగిన వివరాలను పొందవచ్చని వెల్లడించింది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు, సేవలు పొందగలిగే పనులకు సంబంధించి సందర్శకులను అనుమతించబోమని కూడా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







