ఏపీ-తెలంగాణలకు నిరాశ!

- February 25, 2016 , by Maagulf
ఏపీ-తెలంగాణలకు నిరాశ!

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అంత ఆశాజనకంగా ఏమీ కనిపించలేదు. ప్రయాణీకులకు ఎన్నో తాయిలాలు ప్రకటించినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల విషయంలో మాత్రం మొండిచేయి చూపారు.ఏపీలో విశాఖ రైల్వే జోన్ గురించి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో విశాఖ రైల్వే జోన్ పైన కేంద్రం హామీ ఇచ్చింది. అయితే, ఈ హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. ఈ బడ్జెట్‍లోను విశాఖ రైల్వే జోన్ ఊసు లేదు.కేంద్రమంత్రి ఎలాంటి మాట మాట్లాడలేదు.తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ పొడిగింపు విషయంలో కేంద్రమంత్రి మొండిచేయి చూపారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. దీని విషయంలో తెలంగాణకు నిరాశ ఎదురైంది.కోనసీమవాసులు చాలా రోజులుగా కోటిపల్లి -నర్సాపూర్ రైల్వే లైన్ కోసం డిమాండ్ చేస్తున్నారు. దీని విషయంలోను ఈ బడ్జెట్లో కేంద్రమంత్రి ప్రస్తావించలేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ రైల్వే బడ్జెట్ నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com