సౌదీ నుండి భర్త మృతదేహం తెప్పించాలని హైకోర్టును ఆశ్రయించిన భార్య
- February 07, 2021
తెలంగాణ:నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామానికి చెందిన వొంటరి నర్సారెడ్డి గత ఏడాది నవంబర్ 1న సౌదీ అరేబియాలో పనిప్రదేశంలో ప్రమాదవత్తు మృతిచెందాడు.మూడు నెలలయినా మృతదేహం రాలేదని, వెంటనే సౌదీ నుండి ఇండియాకు తన భర్త మృతదేహ శవపేటికను తెప్పించాలని కోరుతూ మృతుని భార్య వొంటరి లక్ష్మి, గల్ఫ్ కార్మిక నాయకుడు స్వదేశ్ పరికిపండ్ల దాఖలు చేసిన రిట్ పిటిషన్ (WP 2671/2021) పై సోమవారం (08.02.2021) తెలంగాణ హైకోర్టులో జస్టిస్ అభినంద్ కుమార్ శావిలి బెంచి విచారణ చేపట్టనున్నది. కేసు విచారణకు రానున్న సోమవారానికి గల్ఫ్ కార్మికుడు మృతిచెంది 100 రోజులు అవుతుంది.మృతదేహాన్ని సౌదీ నుండి ఇండియాకు పంపాలని ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రియాద్ లోని ఇండియన్ ఎంబసీ, తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై విభాగాలకు వినతి పత్రాలు పంపినా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సే, ఎంపీలకు, కేంద్ర రాష్ట్ర మంత్రులకు
మొరపెట్టుకున్నా మూడు నెలలు గడిచిపోయినా శవపేటిక రాలేదు.మృతదేహం కోసం ఎదిరి చూసి చూసి చివరికి కుటుంబ సభ్యులు ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల,దీకొండ కిరణ్ లను సంప్రదించారు. మృతుడి కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని కార్మిక నాయకులు ఈనెల 3న హైదరాబాద్ కు చేరుకొని ప్రముఖ మానవహక్కుల కార్యకర్త, హైకోర్టు న్యాయవాది పి.శశికిరణ్ ను సంప్రదించారు. ఆయన సూచనమేరకు హైకోర్టులో రిట్ వేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత పాస్ పోర్టు కార్యాలయ ఆవరణలోని భారత విదేశాంగ శాఖ అధికారి, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ ముఖేష్ కౌశిక్ కు వినతిపత్రం సమర్పించారు.

న్యాయవాది శశి కిరణ్ భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయాన్ని ప్రతివాదులుగా చేస్తూ ఈనెల 4న రిట్ పిటిషన్ ఫైల్ చేశారు.మృతుడు వొంటరి నర్సారెడ్డి భార్య వొంటరి లక్ష్మి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల పిటిషనర్లుగా ఉన్నారు. మృతదేహాన్ని వెంటనే సౌదీ నుండి భారత్ కు పంపేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







