వ్యాక్సిన్ తీసుకున్న వారికే ప్రభుత్వ ఆఫీసుల్లోకి అనుమతి..
- February 07, 2021
రస్ అల్ ఖైమా:కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు రస్ అల్ ఖైమా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ సేవల కోసం ప్రభుత్వ ఆఫీసులను సందర్శించే వినియోగదారులు ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతి ఉంటుందని ప్రకటించింది. కోవిడ్ కట్టడి కోసం చేపడుతున్న పలు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కనీసం రెండు వారాల ముందు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొన్న వారికి మాత్రమే ప్రభుత్వ ఆఫీసులలోకి అనుమతి ఉంటుందని వెల్లడించింది. సోమవారం నుంచే ఈ నిబంధన అమలులోకి రానుంది. అలాగే పలు సేవల కోసం వెళ్లే వినియోగదారులు అంతా..విధిగా ఫేస్ మాస్క్ ధరించటంతో పాటు భౌతిక దూరం పాటించాలని...టెంపరేచర్ చెకప్ చేసిన తర్వాతే ఆఫీసులోకి ఎంటర్ అవ్వాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







