అదుపు తప్పిన తూటాకు భారతీయ కార్మికుడు బలి మరో ముగ్గురు భారతీయలకు గాయాలు
- February 25, 2016
తీవ్రవాదిపై తూటా పేలిస్తే...బతుకుతెరువు కోసం పొట్ట చేత్తో పట్టుకొని ఎడారి దేశాలకు వెళ్ళిన ఓ కార్మికుడిని తాకి అతని ప్రాణాలను బాలి తీసుకొంది. ఆ కరుణ లేని కటిన తూటాలు మరో ముగ్గురు సహచర భారతీయ కార్మికులను గాయపర్చాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వార్తకు సంబంధించి స్థానిక భారతీయులు తెలిపిన వివరాలలోనికి వెళితే, అవామియా పట్టణ శివార్లలోని ఒక వ్యవసాయ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం బహెరిన్ కు చెందిన అలీ మొహ్మౌద్ అల్ అబ్దుల్లహ్ అనే తీవ్రవాదిని పట్టుకొనేందుకు సౌదీ అరేబియా పోలీసులు అక్కడకు చేరుకొన్నారు, వీరి రాకను గమనించిన ఆ తీవ్రవాది సౌదీ భద్రత వ్యవస్థ దళంపై కాల్పులు జరపగా అందుకు ప్రతిస్పందిస్తూ సౌదీ పోలీసులు ఆ తీవ్రవాదిపై తూటాల వర్షం కురిపించి హతమార్చారు. ఈ ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో ఇక ఇంటి గదిలో నల్గురు భారతీయ కార్మికులు నివసిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనలో కొన్ని తూటాలు వీరి నివసిస్తున్న ఇంటివైపు దూసుకువచ్చాయి. కొన్ని తూటాలు ఒక కార్మికుడి ప్రాణం తీయగా, సహచర ముగ్గురు కార్మికులను గాయపర్చాయి. వీరిలో ఒకరకి తూటా భుజం లోనికి దిగబడింది. కాగా, సౌదీ అంతర్గత మంత్రిత్వశాఖ జనరల్ మన్సౌర్ అల్ తుర్కి రియాద్ ఎ.ఎఫ్.పి. తో మాట్లాడుతూ, తాము తీవ్రవాదిని మాత్రమె చంపినట్లు ఈ సంఘటనలో మరెవరు మరణించలేదని తెలియచేసారు. అయెతే, ఆసుపత్రి వర్గాల కధనం ప్రకారం బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో బుల్లెట్ దిగి మృతి చెందిన ఒక కార్మికుడిని మరో ముగ్గురు భారతీయ కార్మికులను కొందరు వైద్యం నిమిత్తం తీసుకువచ్చారని గాయపడిన వారికి చికిత్స చేసినట్లు తెలియచేస్తున్నారు. ఇది సౌదీ భద్రత వ్యవస్థ తీవ్రవాద ఏరివేత అనంతరం వీరిని ఆసుపత్రి తిసుకోనివచ్చినట్లు వైద్య సిబ్బంది వివరిస్తున్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







