ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్ పనితీరుపై దక్షిణాఫ్రికా అసంతృప్తి

- February 08, 2021 , by Maagulf
ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సిన్ పనితీరుపై దక్షిణాఫ్రికా అసంతృప్తి

జొహ్యానెస్బర్గ్:ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ పై దక్షిణాఫ్రికా పెదవి విరుస్తోంది. ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ఏమంత ప్రభావం చూపడంలేదంటూ దక్షిణాఫ్రికా ఆ వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేసింది. దీనిపై బ్రిటన్ వర్గాలు స్పందించాయి. కరోనా మరణాలను, తీవ్ర అస్వస్థతను నివారించడంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ విఫలమవుతోందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, కానీ దక్షిణాఫ్రికా ఈ వ్యాక్సిన్ పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసిందని బ్రిటన్ సహాయ మంత్రి ఎడ్వర్డ్ ఆర్గర్ వెల్లడించారు. తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న కరోనా స్ట్రెయిన్ పైనా ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడించారు.

కాగా, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపట్టడంలో ఇజ్రాయెల్ దేశం ముందంజలో ఉంది. ఆ తర్వాత యూఏఈ, బ్రిటన్, బహ్రెయిన్, అమెరికా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాల జాబితాలో ఐదో స్థానంలో ఉన్న బ్రిటన్ కూడా ఆగమేఘాలపై వ్యాక్సినేషన్ అమలు చేస్తోంది. ఇప్పటికే 12 మిలియన్ల మందికి అక్కడ తొలి డోసు వేశారు. సెకండ్ డోసు ప్రక్రియ కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com