ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో యువతకు సహాయపడుతున్న GMRVF

- February 08, 2021 , by Maagulf
ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో యువతకు సహాయపడుతున్న GMRVF
  • స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలో 17 మంది విద్యార్థుల ఎంపికకు సహాయపడిన జీఎంఆర్‌వీఎఫ్
  • సీఐఎస్‌ఎఫ్‌కు ఎంపికైన వారిలో ముగ్గురు బాలికలు
  • గత 15 ఏళ్లలో 500 మందికి పైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు    

 

హైదరాబాద్: జీఎంఆర్ గ్రూప్ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) విభాగం జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ (GMRVF) నిరుపేద విద్యార్థులు తమ కలలను నిజం చేసుకోవడానికి సహాయపడుతోంది. సామాజిక మౌలిక సదుపాయాలు కల్పించడం, తాను పని చేస్తున్న ప్రదేశాల చుట్టూ ఉన్న ప్రజల జీవన నాణ్యతను పెంచడం జీఎంఆర్‌వీఎఫ్ లక్ష్యాలు. విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, మహిళా సాధికారతల విషయంలో జీఎంఆర్‌వీఎఫ్ తన ప్రభావాన్ని చూపుతోంది.

ఇటీవల, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, రాజాంలోని జీఎంఆర్‌విఎఫ్ ‘ప్రతిభా లైబ్రరీ అండ్ కౌన్సెలింగ్ సెంటర్’ పదిహేడు మంది విద్యార్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలో విజయం సాధించడానికి సహాయపడింది. ఈ పరీక్షలో 8 మంది విద్యార్థులు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్), ఐదుగురు విద్యార్థులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), నలుగురు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బిఎస్ఎఫ్)కు ఎంపికయ్యారు. పదిహేడు మంది విద్యార్థులలో, విజయవంతంగా సీఐఎస్ఎఫ్‌కు ఎంపికైన ముగ్గురు బాలికలు కూడా ఉన్నారు.

సమాజానికి తన వంతు భాగంగా జీఎంఆర్‌విఎఫ్ ‘ప్రతిభా లైబ్రరీ అండ్ కౌన్సెలింగ్ సెంటర్’ నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో నిరంతరం మార్గదర్శకత్వం వహిస్తోంది. 2005లో రాజాంలో స్థాపించిన ప్రతిభా లైబ్రరీ, కౌన్సెలింగ్ సెంటర్ ప్రధానంగా నిరుపేద వర్గాలకు చెందిన యువత ఒక క్రమబద్ధమైన వ్యూహం ద్వారా వారి లక్ష్యాలను సాధించడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, ఉపాధి కోసం అన్ని పోటీ ఎంపికలకు వారిని సంసిద్ధులను చేయడానికి సహాయపడుతోంది. 

డాక్టర్ అవనీష్ కుమార్, డైరెక్టర్, కమ్యూనిటీ సర్వీసెస్ విభాగం- జీఎంఆర్‌వీఎఫ్, మాట్లాడుతూ “కఠినమైన ఎంపిక ప్రక్రియను దాటుకుని విజయం సాధించిన మా విద్యార్థుల విషయంలో మేం గర్విస్తున్నాము. జీఎంఆర్‌వీఎఫ్ విద్యార్థులకు అందించిన వ్యూహాత్మక ప్రణాళిక, నిపుణుల కోచింగ్, మాక్ టెస్ట్‌లు దీనిని ఛేదించడానికి సహాయపడ్డాయి. దేశ భవిష్యత్తుల కోసం యువత తమ లక్ష్యాలను సాధించడానికి మేం సహాయపడుతూనే ఉంటాము.” అన్నారు.

‘గణితం, రీజనింగ్’, ‘జనరల్ స్టడీస్’లో విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడంతో పాటు, పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించే విషయంలోనూ ప్రతిభా సెంటర్ వారికి సహాయపడింది. ఔత్సాహికులకు మార్గనిర్దేశం చేయడానికి మునుపటి బ్యాచ్‌లలో విజయవంతమైన అభ్యర్థులతో సెషన్లు కూడా నిర్వహించారు.

ప్రాథమిక రౌండులో విజయం సాధించిన అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్ష కోసం  జీసీఎస్ఆర్ కళాశాల గ్రౌండును ఉపయోగించుకోనివ్వడం జరిగింది. ప్రతిభా లైబ్రరీ, కౌన్సెలింగ్ సెంటర్ ప్రయత్నాలు ఫలించి, ఇటీవల ప్రకటించిన ఎస్‌ఎస్‌సి ఫలితాల్లో 17 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారు. 

గత 15 సంవత్సరాలుగా ప్రతిభా లైబ్రరీ రాజాం, దాని చుట్టుపక్కల ఉన్న 500కు పైగా యువత ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో సహాయపడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com