ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్..ఇండియాలో నేరుగా కంపెనీ ఏర్పాటుకు లైన్ క్లియర్

- February 09, 2021 , by Maagulf
ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్..ఇండియాలో నేరుగా కంపెనీ ఏర్పాటుకు లైన్ క్లియర్

2021-22 వార్షిక బడ్జెట్ లో విదేశీ పెట్టుబడులకు రూట్ క్లియర్ చేసిన కేంద్రం..ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్ అందించింది.గల్ఫ్ దేశాల్లో ఉండున్న ఎన్ఆర్ఐలు వచ్చే ఏప్రిల్ నుంచి నుంచి ఇండియాలో సొంతంగా కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు.గతంలో ఎన్ఆర్ఐలకు ఈ వెసులుబాటు లేదు. ఈ మేరకు కంపెనీస్ ఇన్కార్పోరేషన్ చట్టాన్ని సవరించి  వన్ పర్సన్ కంపెనీస్ కు మార్గం సుగమమం చేసినట్లు అంతర్గత వాణిజ్యం, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి గురుప్రసాద్ వెల్లడించారు.అంతేకాదు..ఎన్ఆర్ఐ పెట్టుబడులతో పరోక్షంగా ఏర్పాటు చేసిన కంపెనీలు లిమిటెడ్ కంపెనీలుగా మారటానికి గతంలో రెండు సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చేది. అలాగే మూలధనం వ్యయం 50 లక్షలు దాటినా వార్షిక టర్నోవర్ 2 కోట్ల రూపాయలకు చేరినా పరిమితులు ఉండేవి. కానీ, ఇప్పుడు ఆ అవరోధకాలు కూడా లేవు. ఎన్ఆర్ఐ తన సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకోవటంతో పాటు లిమిటెడ్ కంపెనీగా మార్చుకునేందుకు గతంలో మాదిరిగా రెండేళ్లు వేచి చూడాల్సిన అవసరం లేదు. అలాగే మూలధన వ్యయం, వార్షిక టర్నోవర్ పై ఎలాంటి పరిమితులు లేవు. అలాగే ఎన్ఆర్ఐలు ఇండియాలో ఉండాల్సిన సమయాన్ని 182 నుంచి 120 రోజులకు కుదించింది. దీంతో వన్ పర్సన్ కంపెనీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయని గురుప్రసాద్ వెల్లడించారు. గ్లోబల్ మీడియా డేటా మేరకు ఒక్క సౌదీ అరేబియాలోనే 15 లక్షల మంది ఎన్ఆర్ఐలు ఉన్నారని, భారత ప్రభుత్వం ఓపీసీల ప్రొత్సాహానికి ప్రకటించిన అవకాశాన్ని ఆసక్తిగల పారిశ్రామికవేత్తలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com