సమాజం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు:ఉపరాష్ట్రపతి

- February 09, 2021 , by Maagulf
సమాజం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు:ఉపరాష్ట్రపతి
మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి డా. ఇబ్రహిమి యాత్రా అనుభవాల సంకలనం ది బ్యూటీఫుల్ వరల్డ్ (అందమైన ప్రపంచం) పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
 
న్యూఢిల్లీ:ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సందర్శన ద్వారా ఎంతో నేర్చుకోవచ్చని, అందుకే దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విహార యాత్రలు, విజ్ఞాన యాత్రలు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి డా.ఎం.ఏ. ఇబ్రహీమీ రాసిన యాత్ర అనుభవాల పుస్తకం 'ది బ్యూటిఫుల్ వరల్డ్' (అందమైన ప్రపంచం) పుస్తకాన్ని ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో ఆవిష్కరించారు. 
తన జీవితంలో సింహభాగం సమాజం నుంచే నేర్చుకున్నానన్న ఉపరాష్ట్రపతి, దేశంలోని దాదాపు ప్రతి జిల్లాలో పర్యటించానని, నేటికీ దేశ వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ, వివిధ విశ్వవిద్యాలయాలను,  విజ్ఞాన కేంద్రాలను సందర్శించడంతో పాటు విద్యార్థులు, శాస్త్రవేత్తలతో మాట్లాడడం వెనుక ప్రధాన ఉద్దేశం ఇదేనని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతలో సృజనాత్మకత, సమాజం పట్ల అవగాహన పెరిగేందుకు ఇలాంటి యాత్రలు ఎంతో ఉపకరిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డా. ఇబ్రహిమి తమ యాత్ర అనుభవాలను పంచుకున్నారు. ఈ పుస్తకంలోని అంశాలు చదువరులకు వివిధ సంస్కృతుల గురించి తెలియజేయడానికి తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com