హోమ్ లోన్ కు ఫీజులు మాఫీ...SBI బంపర్ ఆఫర్
- February 11, 2021
ప్రస్తుతం భారతదేశంలో దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకు గా కొనసాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం తమ కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తూ రోజురోజుకు తమ కస్టమర్ల సంఖ్య పెంచుకుంటూ ముందుకు సాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ క్రమంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినూత్నమైన సర్వీసులను కూడా తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు వస్తుంది అన్న విషయం తెలిసిందే. అధునాతన టెక్నాలజీకి అనుగుణంగా తమ సేవలను ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకుంటు ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఎక్కువ మంది కస్టమర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ కలిగి ఉండడాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ఇప్పటికే వివిధ రకాల సర్వీసులను అందిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల యొక్క ఆర్థిక అవసరాలను తీర్చి వారికి అండగా నిలబడేందుకు పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, హోమ్ లోన్ లాంటివి కూడా అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఆయా రుణాలపై తక్కువ వడ్డీ విధించడంతో పాటు వివిధ రకాల ప్రయోజనాలు కలిగే విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ లు అందరికీ అదిరిపోయే శుభవార్త చెప్పింది.
హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి ఒక శుభ వార్త చెప్పింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హోమ్ లోన్ కి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మినహా ఇస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే అధికారిక వెబ్సైట్లో తెలిపింది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకు మాత్రమే ఉంటుంది. మార్చి 31 లోపు హోమ్ లోన్ తీసుకున్న వారికి ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఉంటుంది అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. స్టేట్ బ్యాంకుకు హోమ్ లోన్ కి సంబంధించి మార్కెట్లో 34 శాతం వాటా ఉండగా ఇప్పటి వరకు 5 లక్షల కోట్ల రుణాలు అందించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది సరికొత్త రికార్డు అనే చెప్పాలి.
తాజా వార్తలు
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన







