కోవిడ్ జాగ్రత్తల్లో దుబాయ్ పోలీసులు...
- February 11, 2021
దుబాయ్:కింగ్డమ్ లో కరోనా వ్యాప్తిని ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు యూఏఈ ఫెడరల్ గవర్నమెంట్ ఇప్పటికే పలు మార్గనిర్దేశకాలు జారీ చేసింది. ఫేడరల్ గవర్నమెంట్ నిర్ణయాలకు అనుగుణంగా ఎమిరాతి పాలనా యంత్రాంగాలు కూడా తమ పరిధిలో పలు ముందస్తు జాగ్రత్త చర్యలను కఠినంగా అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పీసీఆర్ టెస్టుల చేయించుకోవాలన్న షరతులు, వర్క్ ఫ్రమ్ హోమ్, వీలైనంత వరకు పలు డిపార్ట్మెంట్లలో ఆన్ లైన్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు పోలీస్ స్టేషన్ల వంతు వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ ను కోవిడ్ ముప్పు నుంచి తప్పించేందుకు పలు జాగ్రత్త చర్యలను పాటిస్తున్నారు. ఇక నుంచి వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే స్టేషన్లోకి ఎంట్రీ ఉంటుందని దుబాయ్ పోలీసులు స్పష్టం చేశారు. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోకుంటే..48 గంటల్లోపు తీసుకున్న పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి అని వెల్లడించారు. పీసీఆర్ రిపోర్ట్ లో కోవిడ్ నెగటీవ్ ఉన్నవారినే పోలీస్ స్టేషన్లోకి అనుమతిస్తామని వివరించారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రజలు కూడా సహకరించాలని, వీలైనంత వరకు ఆన్ లైన్ సేవలను వినియోగించుకోవాలని దుబాయ్ పోలీస్ జనరల్ కమాండ్ కార్యాలయం సూచించింది. దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్ సైట్, కాల్ సెంటర్ 901 తో పాటు 24 గంటలు పని చేసే స్మార్ట్ పోలీస్ స్టేషన్ సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవాలని గుర్తు చేసింది. ఇదిలాఉంటే..వ్యాక్సిన్ తీసుకున్న వారు, పీసీఆర్ రిపోర్ట్ ఉన్నవారికే పోలీస్ స్టేషన్ కు అనుమతిస్తామని షార్జా పోలీసులు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







