వ్యవసాయ ఎగుమతులను పెంచడానికి కలిసి పని చేయనున్న హైదరాబాద్ ఎయిర్ కార్గో, తెలంగాణ ప్రభుత్వం
- February 11, 2021
హైదరాబాద్:జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ యొక్క 100% అనుబంధ సంస్థ, జీఎంఆర్ ఎయిర్ కార్గో అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (GACAEL) విభాగమైన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC) ఈ రోజు "ఎయిర్ కార్గో ద్వారా తెలంగాణ నుండి వ్యవసాయ ఎగుమతులను పెంచడం" అనే అంశంపై ఒక వర్క్‌షాప్ నిర్వహించింది
 (1)_1613058069.jpg t3 https://www.maagulf.com/godata/images/202102/GHAC - Tel govt colloborate for agri exports (2)_1613057990.jpg T2 https://www.maagulf.com/godata/images/202102/GHAC - Tel govt colloborate for agri exports (2)_1613057938.jpg)
_1613057938.jpg)
 (1)_1613058069.jpg t3 https://www.maagulf.com/godata/images/202102/GHAC - Tel govt colloborate for agri exports (2)_1613057990.jpg T2 https://www.maagulf.com/godata/images/202102/GHAC - Tel govt colloborate for agri exports (2)_1613057938.jpg)
డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి, IAS, వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ (APC) & ప్రభుత్వ కార్యదర్శి; ప్రదీప్ పణికర్, CEO-GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్; సౌరభ్ కుమార్, CEO-GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో; తెలంగాణ ప్రభుత్వ, కస్టమ్స్, ఎయిర్ లైన్స్‌కు చెందిన సీనియర్ అధికారులు; ఎగుమతిదారులు, సరుకు రవాణా ఫార్వార్డర్లు మరియు ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ చర్చలో పాల్గొని, ఎయిర్ కార్గో ద్వారా రాష్ట్రం నుండి వ్యవసాయ ఎగుమతుల వృద్ధికి దోహదపడే ఒక వ్యూహాన్ని రూపొందించడానికి వారి విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం చురుకుగా పలు కార్యక్రమాలు తీసుకుంటోంది. మామిడి ఎగుమతికి వికిరణ సదుపాయాలను కూడా కూడా అన్వేషిస్తోంది. శంషాబాద్ సమీపంలో అగ్రి ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
 (1)_1613058069.jpg)
GHAC అనేది భారతదేశంలో WHO-GSDP (ప్రపంచ ఆరోగ్య సంస్థ- మంచి నిల్వ మరియు పంపిణీ పద్ధతులు) సర్టిఫైడ్ ప్రధాన కేంద్రం. టెంపరేచర్ సెన్సిటివ్ కార్గో నిర్వహణ, దానిని ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆటంకాలూ లేకుండా రవాణా చేయడానికి ఇది చాలా అవసరం. పెరిషబుల్స్, వ్యవసాయ ఉత్పత్తులు, వివిధ తాత్కాలిక-నియంత్రిత ఔషధాలకు అవసరమైన ప్రత్యేక సదుపాయాల కోసం GHAC తన ఫెసిలిటీస్‌ను విస్తరించి, ల్యాండ్సైడ్ మరియు ఎయిర్‌సైడ్‌లో ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తోంది. ఆ దిశగా హైదరాబాద్ కార్గో ఇప్పటికే ఒక పెద్ద, కస్టమ్ బిల్ట్ కూల్ డాలీని ప్రారంభించింది - ఇది ఎయిర్ సైడ్ రవాణా కోసం మొబైల్ రిఫ్రిజిరేటెడ్ యూనిట్. హైదరాబాద్ కార్గోలో నిర్వహించబడే ప్రధాన ఎగుమతి మరియు దిగుమతి వస్తువులలో పెరిషబుల్స్ (వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులు), ఔషధాలు, ఇంజనీరింగ్ & ఏరోస్పేస్ వస్తువులు, వస్త్రాలు మరియు ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి.
_1613057938.jpg)
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







