భారతీయులు కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కాన్సులేట్ సూచన

- February 12, 2021 , by Maagulf
భారతీయులు కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కాన్సులేట్ సూచన

దుబాయ్:యూఏఈలో గత కొంత కాలంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటం పట్ల ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది.పెరుగుతున్న వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని యూఏఈలోని అతిపెద్ద వలస సమాజమైన భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం సూచించింది.మనల్ని మనం రక్షించుకుంటూ, సమాజ శ్రేయస్సు కోసం యూఏలోని ప్రతి భారతీయుడు బాధ్యతతో వ్యవహరించాల్సిన సమయం అని పేర్కొంది.యూఏఈ ప్రభుత్వం సూచనల మేరకు ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, తప్పనిసరిగా ఫేస్ మాస్కులు ధరించాలని తెలిపింది. ప్రతి చోట భౌతిక దూరం పాటించాలని కోరింది.అంతేకాదు..వివిధ పనులు, సేవలు పొందే నిమిత్తం కాన్సులేట్ కార్యాలయానికి రావాలనుకునే వారు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించింది.ముందు జాగ్రత్త చర్యలను పాటించటంలో భాగంగా అత్యవసరమైతే తప్ప నేరుగా కాన్సులేట్ కార్యాలయానికి రావొద్దని సూచించింది.కాన్సులేట్ కార్యాలయం నుంచి సేవలను పొందాలనుకునే వారు కాన్పులేట్ అందిస్తున్న ఆన్ లైన్ సేవలను వినియోగించుకోవాలని వెల్లడించింది. అందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను వివరిస్తూ..80046342 ఫోన్ లైన్ ద్వారా ప్రతి రోజు 24 గంటలు తమను సంప్రదించవచ్చని పేర్కొంది. అలాగే పీబీఎస్కే యాప్ ద్వారాగానీ, [email protected] కి మెయిల్ ద్వారాగానీ, +971-54-3090571 వాట్స్ యాప్ ద్వారాగానీ కాన్సులేట్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చిని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com