చికెన్ పచ్చడి తయారీ విధానం
- February 12, 2021
కావాల్సిన పదార్ధాలు:
కోడి మాసం
మసాలా పొడి (రెడీమేడ్ గా దొరికేది వేసుకోవచ్చు) లేదా
(మసాలా తయారీకి ;లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు.. వీటిని నూనెల లేకుండా నార్మల్ గానే వేపించుకుని పొడి చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్
ఉప్పు… పచ్చళ్లకు
నిమ్మ పులుసు… నాలుగు కప్పులు
పసుపు… ఒక టీస్పూను
వెల్లుల్లి… ఒకటి
నూనె… ఒక కిలో
పచ్చికారం… రుచికి సరిపోయినంత
ధనియాల పొడి కొంచెం
తయారీ విధానం :
ముందుగా కోడి మాంసాన్ని శుభ్రం చేసి ముక్కలుగా కోసుకుని కుక్కర్ లో కొంచెం నీరు .. అల్లం వెల్లులి పేస్ట్ , కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి.. అనంతరం ఒక కళాయిలో నూనె పోసి, బాగా కాగిన తరువాత అనంతరం ఆ ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి. అలా వేగిన ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి ఆ వేడి వేడి ముక్కలమీద కారం.. గరం మసాలా పొడి కొంచెం పసుపు ఉప్పు వేసి అనంతరం కాగిన నూనె పోయాలి.
తరవాత కొంచెం నూనె లో నిమ్మరసం వేసి కొంచెం వేడి చేసి మాంసం ముక్కలపై వేసి కలపాలి. ఈ మిశ్రమానికి కర్వేపాకు , వెల్లుల్లి, ఎండు మిర్చి వేసి పోపు పెట్టాలి.. అనంతరం ఈ మిశ్రమాన్ని నీరు తగలకుండా జాడీలో భద్రపరచుకోవాలి. ఇలా తయారు చేసిన ఆవకాయ రెండు మూడు నెలల వరకు నిలువ వుంటుంది
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష