ఈ-రిక్షాలు పంపిణీ చేసిన బాలీవుడ్ నటుడు సోనూసూద్

- February 13, 2021 , by Maagulf
ఈ-రిక్షాలు పంపిణీ చేసిన బాలీవుడ్ నటుడు సోనూసూద్

ముంబై:బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్ తన స్వస్థలమైన పంజాబ్‌లోని మోగా పట్టణంలో ఎనిమిది మంది నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ రిక్షాలు (ఈరిక్షా) అందించాడు.ఈ సందర్భంగా సోనూ మాట్లాడుతూ..భారత దేశవ్యాప్తంగా 150 ఈరిక్షాలు పంచాలని నిర్ణయించుకున్నానని, ఫలితంగా కొంతమందికైనా ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నాడు.

సాయం చేయగలిగే స్థితిలో ఉండే ప్రతి ఒక్కరు అవసరమైన వారికి తోచినంత సాయం చేయాలని పిలుపునిచ్చాడు.తనకు సేవాగుణం అలవడడానికి తన తల్లిదండ్రులే కారణమన్నాడు. అవసరమైన వారికి సాయం చేస్తూ అందరిలానే తన బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టు సోనూ చెప్పుకొచ్చాడు.ఈ కార్యక్రమంలో ఆయన సోదరి మాళవిక సచార్, బావ గౌతమ్ సచార్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com