హైదరాబాద్ బీ-ఫార్మసీ విద్యార్థిని కేసులో న్యూ ట్విస్ట్
- February 13, 2021
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో బీ-ఫార్మసీ విద్యార్థిని కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఘట్‌కేసర్ కిడ్నాప్, అత్యాచారం ఘటన కట్టుకథగా రాచకొండ పోలీసులు తేల్చారు. బిఫార్మసీ విద్యార్థిని ఇంట్లోంచి బయటకు వెళ్లే ఉద్దేశంతోనే అందర్నీ తప్పుదోవ పట్టించినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ స్పష్టం చేశారు.ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో సహా నలుగురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. తప్పుడు కేసుగా నిర్ధారించామని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు వీగిపోయింది. కుటుంబ వివాదాలతోనే యువతి బయటకు వెళ్లిందన్నారు. కావాలనే యువతి కట్టుకథ అల్లిందని వివరించారు.
విద్యార్థిని ప్రతిరోజు రంపల్లి బస్ స్టాప్ దగ్గర ఆటో దిగి అక్కడి నుండి ఇంటికి వెళుతుంది. అయితే 10 వ తేదీన ఇంటికి ఫోన్ చేసి ఆటో ఆపలేదని చెప్పింది. 7:45 కు మళ్ళీ ఫోన్ చేసి తనను కొందరు కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు అమ్మాయిని లైవ్ లొకేషన్ పెట్టమని అడిగితే పెట్టింది. అది అనోజిగుడ ప్రాంతం అక్కడికి పోలీసులు వచ్చి చూసేసరికి అమ్మాయి చిరిగిపోయిన దుస్తులతో కనిపించింది. వెంటనే అమ్మాయిని దగ్గరలోని క్యూర్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు.
తర్వాత అమ్మాయిని ఎక్కిన ఆటో గురించి ఆనవాలు అడిగాం, కొంచెం డామేజ్ అయిన మూడు ఆటోలు గుర్తించి కొంత మంది ఆటో డ్రైవర్ ఫోటోలు చూపిస్తే అమ్మాయి వారిని గుర్తించింది. యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్‌ల పై కేసులు నమోదు చేశాం. తన పై ఆటో డ్రైవర్ లు రేప్ చేశారని మాకు స్టేట్ మెంట్ ఇచ్చింది. రేప్ జరిగిందా లేదా అనే విషయం పై హాస్పిటల్‌లో టెస్ట్‌లు చేయించాం. మరోమారు తన పై కర్రలతో దాడి చేశారని యువతి తెలిపింది. ఆటో వాళ్లను అదుపులోకి తీసుకుని విచారించాం. సైంటిఫిక్ దర్యాప్తు లో ఆటో డ్రైవర్ తప్పు లేదని తేలింది. అమ్మాయి రేప్ జరిగింది అని చెప్పిన సమయానికి ఆటో డ్రైవర్ ఒక మల్టీప్లెక్స్ కి వెళ్ళారు. అన్ని సీసీ టీవీ లు పరిశీలించాక ఆటో డ్రైవర్ చెప్పింది నిజం అని తేలింది. అమ్మాయి పోలిసులను తప్పు దోవ పట్టించిందన్నారు.
యన్నం పేట్ దగ్గర అమ్మాయి ఆటో దిగిన సీసీ ఫుటేజ్ మాకు దొరికింది. యన్నంపేట్ నుంచి అంజోజి గూడా వరకు 100 సీసీ ఫుటేజ్ గమనించాం.ఈ కేసు లో సీసీ ఫుటేజ్ లు కీలక ఆధారాలుగా నిలిచాయి. యాన్నం పేట్ నుండి 4 కిలో మీటర్ లు అమ్మాయి నడిచింది. కిడ్నాప్ ఎలా చేయాలో అమ్మాయి కి బాగా తెలుసు.గతంలో ఆరునెలల క్రితం ఇదే తరహా లో కిడ్నాప్ ప్లాన్ చేసింది. తన పై ఎలాంటి రేప్ జరగలేదని అమ్మాయి చెప్పింది.అమ్మాయికి ఇంట్లో నుండి వెళ్లిపోవాలని ఎప్పటి నుంచో ఉంది.6 నెలల క్రితం తన ఫ్రెండ్ కి ఇంకో కిడ్నాప్ కథ చెప్పింది. అమ్మాయికి కిడ్నాప్ లు అంటే ఒక రకమైన ఇష్టం.ఈ కేస్ లో ఆటో డ్రైవర్‌లకు ఎలాంటి సంబంధం లేదు. విచారణ లో భాగంగా ఆటో డ్రైవర్ లను విచారించాం వారి తప్పు లేదు.వారు మాకు బాగా సహకరించారు.. వారికి క్షమాపణలు చెబుతున్నామని సీపీ చెప్పారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







