జనవరిలో 115 కొత్త ఫ్యాక్టీరీలకు లైసెన్స్ జారీ చేసిన సౌదీ
- February 13, 2021
రియాద్:సౌదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం కరోనా సంక్షోభంలో దేశీయంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడుతోంది. ఇంతటి ఒడిదుడుకుల పరిస్థితుల్లోనూ గత జనవరిలో 115 కొత్త ఫ్యాక్టరీలు ఏర్పాటైనట్లు పారిశ్రామిక, ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 1.63 బిలియన్ల రియాల్స్ విలువైన 115 కొత్త ఫ్యాక్టరీలకు జనవరిలో లైసెన్స్ జారీ చేశామని తెలిపింది. దీంతో ఇప్పటికే ఉన్న పరిశ్రమలు, నిర్మాణంలో ఉన్న పరిశ్రమలు కలుపుకొని కింగ్డమ్ పరిధిలోని పరిశ్రమల సంఖ్య 9,783కి పెరిగిందని వివరించింది. గత డిసెంబర్ నాటికి నమోదైన పరిశ్రమల సంఖ్య 9,681 అని పేర్కొంది. అయితే..కొత్తగా వచ్చిన ఫ్యాక్టరీల ద్వారా 3,143 మంది వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు దక్కితే.. కేవలం 173 మంది స్థానిక కార్మికులకు మాత్రమే ఉద్యోగాలు దక్కాయని తెలిపింది. అయితే..జాతీయ పరిశ్రమల మధ్య అసంబద్ధంగా ఉన్న పోటీ తత్వాన్ని నివారించేందుకు మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని పేర్కొంది. ప్రపంచ వాణిజ్య సంస్థ, గల్ఫ్ దేశాల మండలి ప్రమాణాలను పాటిస్తూనే సౌదీ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకొని జాతీయ పరిశ్రమల మధ్య ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. పారదర్శకమైన విధివిధానాలతో అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయం, సహకారంతో పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నట్లు పారిశ్రామిక మంత్రిత్వ శాఖ వివరించింది.
తాజా వార్తలు
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..







