తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధాని మోదీ
- February 14, 2021
చెన్నై:తమిళనాడు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడి రైతులపై ప్రశంసలు కురిపించారు. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని సాధించారని తమినాడు రైతులను మోదీ అభినందించారు. జల వనరులను సమర్థంగా వినియోగించుకుని ఇక్కడి రైతులు భారీ దిగుబడులను రాబట్టారని చెన్నైలో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ప్రశంసించారు. నీటిని సంరక్షించేందుకు మనం శక్తి వంచన లేకుండా పనిచేయాలని..ప్రతి నీటి బొట్టును మరింత దిగుబడికి అనువుగా మలుచుకోవాలనే నినాదం రైతులు ముందుకెళ్ళాలని కోరారు.
అలాగే చెన్నై మెట్రో రైల్ విస్తరణతోపాటు పలు మౌలిక ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ప్రధాని తమిళనాడు పర్యటనలో ఉన్నారు. మెట్రో రైలు మలిదశలో 9 కిలోమీటర్ల లైన్ ప్రారంభించుకోవడం సంతోషకరమని మోదీ అన్నారు.కరోనా మహమ్మారి వెంటాడినా అనుకున్న సమయానికి ఈ ప్రాజెక్టును అధికారులు, కాంట్రాక్టర్లు పూర్తిచేశారని అన్నారు. చెన్నై మెట్రో వేగంగా జరుగుతుందని..ఈ ఏడాది బడ్జెట్లో మెట్రో రెండో దశకు రూ 63,000 కోట్లు కేటాయించామని చెప్పారు.ఏ నగరంలోని ప్రాజెక్టుకైనా ఈ స్ధాయిలో భారీ నిధులు కేటాయించడం ఇదే తొలిసారని చెప్పారు. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో మౌలిక ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరవడం గమనార్హం.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







