కోవిడ్ వ్యాక్సిన్ తో సెఫ్టీకి ఢోకా లేదు..మరోసారి కువైట్ స్పష్టీకరణ
- February 16, 2021
కువైట్ సిటీ:కోవిడ్ వ్యాక్సిన్ ముమ్మాటికి సురక్షితమేనని మరోసారి స్పష్టం చేసింది కువైట్. వ్యాక్సిన్ సెఫ్టీపై ఎవరికి అనుమానాలు అవసరం లేదని ధీమాగా చెబుతోంది.వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ఇప్పటివరకు ఎలాంటి మరణాలు సంభవించలేదని, ఆరోగ్యం విషమించి ఐసీయూలో చేరలేదని పేర్కొంది.అంతేకాదు..అనూహ్య సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపించలేదని వివరించింది.వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లందరూ సురక్షితంగానే ఉన్నారని, అయినా..ఆరోగ్య శాఖ అన్ని ముందస్తు జాగ్రత్తలతో సిద్ధంగా ఉందని తెలిపింది.వ్యాక్సిన్ తీసుకున్న వారి ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ ప్రత్యేక నిపుణుల బృందం సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆరా తీస్తోందని వెల్లడించింది.ఇటీవలె కొందరు వ్యక్తులు పనిగట్టుకొని వ్యాక్సిన్ సెఫ్టీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుండటాన్ని కువైట్ తప్పుబట్టింది.కోవిడ్ వ్యాక్సిన్ సెఫ్టీపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని కొట్టిపారేసింది.అంతేకాదు..ప్రజల ఆరోగ్యం విషయంలో అబద్ధపు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం