20 నిమిషాల్లోనే వ్యాక్సినేషన్..యూఏఈలో డ్రైవ్ థ్రూ సెంటర్స్ ఏర్పాటు
- February 16, 2021
యూఏఈ:కోవిడ్ వ్యాక్సిన్ ను వీలైనంత తొందరగా కింగ్డమ్ ప్రజలందరికీ అందించేలా కసరత్తు చేస్తోంది యూఏఈ. ఇందులో భాగంగా అబుధాబిలో డ్రైవ్ థ్రూ వ్యాక్సినేషన్ సెంటర్లను ప్రారంభించింది.ఎమిరేట్స్ పరిధిలో ఏర్పాటైన డ్రైవ్ థ్రూ వ్యాక్సినేషన్ ద్వారా కార్లలోనే వచ్చి..వ్యాక్సిన్ తీసుకొని వెళ్లిపోవచ్చు.వ్యాక్సిన్ వేసుకునేందుకు అవసరమైన ఆరోగ్య అర్హతలను పరిశీలించి 20 నిమిషాల్లోనే వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయటం ఈ కేంద్రాల ప్రత్యేకత. అంతేకాదు..ఒక రోజులోనే 700 మంది, ప్రతి గంటకు 60 మంది చొప్పున వ్యాక్సిన్ ఇచ్చేలా డ్రైవ్ థ్రూ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు.ఈ కేంద్రాల ద్వారా కింగ్డమ్ పరిధిలో వ్యాక్సినేషన్ ను మరింత ముమ్మరం చేయటం..ముఖ్యంగా వృద్ధులకు,దీర్ఘకాలిక రోగులకు త్వరతగతిన వ్యాక్సిన్ అందించేందుకు అస్కారం ఏర్పడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటివరకు 5 మిలియన్ల డోసులను వేశామని..ఇదంతా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బంది చిత్తశుద్ధి వల్లే సాధ్యమైందని అబుధాబి ఆరోగ్య శాఖ చైర్మన్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







