నదిలో పడవ బోల్తా.. 60 మంది దుర్మరణం..
- February 16, 2021_1613455950.jpg)
కాంగో:కాంగో నదిలో ఓ పడవ ప్రమాదవశాత్తు బోల్తా పడింది.ఈ ఘటనలో 60 మంది ప్రయాణికులు మృతి చెందారు. మాయి నోడోంబీ ప్రావిన్స్‌లోని లాంగోలా ఎకోటి గ్రామానికి సమీపంలోని నదిలో ఓడ ప్రమాదవశాత్తు ఓడ మునిగిపోయింది.ప్రమాద సమయంలో ఓటలో 700 మంది ప్రయాణికులున్నారని కాంగో మంత్రి ఎంబీకాయి వెల్లడించారు.పడవ మునిగిన తర్వాత 60 మంది మృతదేహాలను వెలికి గాయగా, మరి కొంత మంది గల్లంతయ్యారని మంత్రి తెలిపారు.అయితే ఓడలో ఉన్న వారిలో 300 మంది వరకు ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు.
ఈ ఓడ కిన్హాసా నుంచి బయలుదేరి భూమధ్య రేఖ ప్రావిన్స్ వైపు వెళ్తుండగా, ఈ ప్రమాదం జరిగింది.పడవలో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటంతో అధిక లోడ్ అయి పడవ మునిగిపోయినట్లు మంత్రి వివరించారు.అయితే పడవ మునిగినట్లు సమాచారం తెలియగానే సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం