ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగావకాశాలు
- February 16, 2021
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థ (IAF) 255 గ్రూప్ సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్,హౌజ్ కీపింగ్ స్టాఫ్, స్టోర్ కీపర్, కార్పెంటర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మార్చి 13 దరఖాస్తుకు చివరి తేదీ.నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://indianairforce.nic.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
అర్హతలు: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.వేతననం.. లెవల్ -1 పోస్టులకు రూ.18,000, లెవెల్-2 పోస్టులకు రూ.19,900, లెవెల్-4 పోస్టులకు రూ.25,500 ఉంటుంది.ఆసక్తి గల అభ్యర్ధులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. దానిని పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి. ముఖ్య సమాచారం: దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 11, 2021 దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 13, 2021 పరీక్ష తేదీ: ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22 వరకు వయసు: 18 నుంచి 25 ఏళ్లు ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టీస్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.వెబ్‌సైట్: https://indianairforce.nic.in/
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..