సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రముఖుల ట్వీట్స్

- February 17, 2021 , by Maagulf
సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రముఖుల ట్వీట్స్

హైదరాబాద్:తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు.కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు..మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని మోదీ ట్వీట్ చేయగా..మీరు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నానని గవర్నర్ తమిళిసై తెలిపారు.వీరితో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మెగాస్టార్ చిరంజీవి పలువురు ప్రముఖులు కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

అటు కేసీఆర్ పుట్టినరోజున కోటి వృక్షార్చనకు టీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది.అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేశారు. ఇక హైదరాబాద్ జలవిహార్‌లో మంత్రి తలసాని ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రస్థానంపై త్రీడీ గ్రాఫిక్స్‌తో 30 నిమిషాల డాక్యుమెంటరీ ప్రదర్శించనున్నారు. మరోవైపు కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో రుద్రహోమం కొనసాగుతోంది. ఇటు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో కేసీఆర్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఆకృతిలో పూలమొక్కల్ని పేర్చి బర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పారు. ఇక్కడే కాకుండా 50 దేశాల్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకులు చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com