తమన్ విడుదల చేసిన 'ఎ' సినిమా పాట!
- February 17, 2021
హైదరాబాద్:‘‘సిలకా సిగురు సాటుకు పోకే...సెలికాని ఎదగూటికి రాయె, జడ కుచ్చులలోన నలగాలని ఉందె, ఒడిలో తలవాల్చి ఒదగాలని ఉందె రాయె..’’ అని ప్రియుడు తన ప్రియురాలి కోసం పాట పాడుకుంటే ఎలా ఉంటుంది! మనసు కరగని ప్రియురాలు ఉంటుందా!! తన ప్రేమనంతా పాటలో కురిపించే ప్రియుడు మనసు లోతును తెలుసుకోవడానికి ప్రియురాలు ఏం చేసింది? ఇదే కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘ఎ’. యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షనల్ థ్రిల్లర్ మూవీలో నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా నటించారు. గీతా మిన్సాల ఈ చిత్ర నిర్మాత. విజయ్ కురాకుల సంగీత సారథ్యం వహించిన ఈ సినిమాలో ‘సిలకా సిగురు సాటుకు పోకే.. .’ పాటను మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ విడుదల చేసి సినిమా పెద్ద హిట్ కావాలని యూనిట్‌కి అభినందనలు తెలిపారు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను దీపు పాడారు. జానపదం స్టైల్లో సాగుతున్న పాట ప్రేకకులను ఆకట్టుకుంటోంది. రీసెంట్గా విజయ్ సేతుపతి విడుదల చేసిన ‘A’ ట్రైలర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తోందని, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 5న విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







