భారత్ లో కరోనా కేసుల వివరాలు
- February 18, 2021_1613625326.jpg)
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే.అయితే, ముంబై, కేరళ రాష్ట్రాల్లో కేసులు తిరిగి పెరుగుతున్నాయి.దీంతో ఆయా రాష్ట్రాలు కరోనాపై తిరిగి దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.నిబంధనలు గాలికి వదిలేయడం వలనే కేసులు పెరుగుతున్నాయి.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 12,881 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,50,201కి చేరింది.ఇందులో 10,06,56,845 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,37,342 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 101 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1,56,014కి చేరింది.ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో భారత్ లో 11,987 మంది ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.చాలా కాలం తరువాత డిశ్చార్జ్ కేసుల కంటే పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయి.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం