ఎండలు మండిపోతున్నాయ్

- May 29, 2015 , by Maagulf
ఎండలు మండిపోతున్నాయ్

వేసవి కాలం కారణంగా ఎండలు మండిపోతున్నాయి.రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఎండలో పనిచేసే కార్మికులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.సువైక్‌ విలాయత్‌లో 47.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది మే 26న. ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మినిస్ట్రీ ఆఫ్‌ మ్యాన్‌ పవర్‌, కార్మికులకు, వివిధ సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది.మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3.30 నిమిషాల వరకూ పనికి విరామం ఇవ్వాలని మంత్రిత్వ శాఖ సూచించింది.ప్రతి సంవత్సరం ఈ సూచనలు అమల్లో ఉంటాయి.మజ్లిస్‌ అల్‌ షురా వైస్‌ ప్రెసిడెంట్‌ సలీమ్‌ అల్‌ కాబి మాట్లాడుతూ, కార్మికుల్ని మానవత్వంతో చూడాలనీ, వారి విషయంలో నిబంధనల్ని ఖచ్చింతంగా పాటించాల్సి ఉందని వివిధ సంస్థలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ సెక్రెటరీ జనరల్‌ డాక్టర్‌ అబేద్‌ అల్‌ షాక్సి, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయనీ, కార్మికులు రెస్ట్‌ తీసుకునేందుకు యాజమాన్యాలు ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.లేనిపక్షంలో యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవన్నారు.అయితే ఒకే చోట పనిచేసేవారి విషయంలో సమస్యలుండవనీ, రోడ్లపై పనిచేసేవారితోనే సమస్య వస్తుందనీ, వారికి సౌకర్యాలు కల్పించడం కష్టం అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సంస్థ యాజమాన్యం అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారత్‌, పాకిస్తాన్‌లోనూ రికార్డు టెంపరేచర్స్‌తో జనం బెంబేలెత్తుతున్నారు.

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com