టెర్రర్ మూవీ రివ్యూ...

- February 26, 2016 , by Maagulf
టెర్రర్ మూవీ రివ్యూ...

చాలా గ్యాప్ తర్వాత శ్రీకాంత్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో వచ్చిన సినిమా టెర్రర్.. లోబడ్జెట్‌తో వచ్చి నైస్ సీక్వెన్స్‌ సీన్స్‌తో ఒక్క పాట కూడా లేకుండా మంచి టాక్‌నే సొంతం చేసుకున్న టెర్రర్ మూవీ కథ అంతా బాంబ్‌ బ్లాస్ట్స్, టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. డిసిపి వి.రాథోడ్(వినయ్) టెర్రరిజం దాడులనుంచి సిటీని రక్షించడం కోసం ఓ స్పెషల్ టీంని రెడీ చేస్తాడు.ఆ టీంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సిఐ విజయ్(శ్రీకాంత్) అనుమానం ఉన్న వారి మీద నిఘా వేస్తాడు. దీంతో ఒక టెర్రరిస్ట్ ఓ భారీ బాంబ్‌బ్లాస్ట్‌కు ప్లాన్ చేశాడనీ, ఈ బ్లాస్ట్ వెనుక రాజకీయ శక్తుల కుట్ర ఉందని తెలుసుకుంటాడు. ఇక అక్కడనుంచి ఆ టెర్రరిస్ట్ అటాక్ ఎలా ఆపాడు?టెర్రరిస్ట్‌ను ఎలా క్యాచ్ చేసి వాళ్ళ ప్లాన్‌ను ఎలా బీట్ చేసాడు? అన్న విషయం మీదే సినిమా కథ అంతా నడుస్తుంది. ఇక క్యారెక్టర్ల విషయానికొస్తే శ్రీకాంత్ తన రోల్‌తో మూవీకి లైఫ్ ఇచ్చాడు. డైలాగ్ డెలివరీలోనూ, బాడీ లాంగ్వేజీతోనూ క్వాలిటీ యాక్షన్ కనబరిచాడు. అలాగే హోంమినిస్టర్ క్యారెక్టర్‌లో కోట శ్రీనివాసరావు, అతనికి సపోర్ట్‌గా పృథ్వీ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూపించారు.టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ సినిమాలో స్పెషల్ ఎలిమెంట్స్‌తో కొద్దిగా తగ్గినట్టుగా కనిపించినా, మూవీ బోర్ కొట్టకుండా నడిచింది. కంక్లూజన్‌లో ఆడియెన్స్ కొద్దిగా మెలోడ్రామా ఎక్కువైందనే ఫీలింగ్‌లో పడే అవకాశం ఉంది. ఈ టైప్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీసి, ఐటెంసాంగ్ లాంటి ఎలిమెంట్స్ లేకుండా డైరెక్టర్ సతీష్ సక్సెస్‌ఫుల్‌గా మంచి రిజల్ట్ ఇచ్చాడనే చెప్పాలి. .కొద్దిగా హిందీ సినిమా పోలికలు కనిపించినా పొలిటికల్ క్రైమ్ థిల్లర్స్ ఇష్టపడే ఆడియెన్స్‌కు ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com