2020 ‘ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్’ గా భాగ్యనగరం
- February 18, 2021
హైదరాబాద్: తెలంగాణకు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఆర్బర్ డే ఫౌండేషన్ అనే సంస్థ.. 2020 ట్రీ సిటీగా హైదరాబాద్‌ను ప్రకటించింది. మంత్రి కెటిఆర్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా హైదరాబాద్‌ను ఆర్బర్ డే ఫౌండేషన్ గుర్తించడం చాలా సంతోషంగా ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. ఆర్బర్ డే ఫౌండేషన్ ట్రీ సిటీ జాబితాలో ఇండియా నుంచి హైదరాబాద్ నగరం ఒక్కటే ఎంపిక కావడం విశేషం. హరితహారం కార్యక్రమంలో భాగంగా పచ్చదనాన్ని పెంచేందుకు తాము చేసిన ప్రయత్నాలకు ఇది గుర్తింపు అని కెటిఆర్ అన్నారు. హరితహారంలో భాగంగా హైదరాబాద్‌లో 2020 ఏడాది వరకు 2.4 కోట్ల మొక్కలు నాటినట్లు ఆర్బర్ డే ఫౌండేషన్ తన వెబ్సైట్లో పేర్కొంది.

తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







