దోహా-విజయవాడ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
- February 20, 2021
ఏ.పిలోని గన్నవరం విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. దోహా నుంచి విజయవాడకు వచ్చి ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ అవుతుండగా విమానం అదుపుతప్పి రన్ వే పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో అప్రమత్తమైన గన్నవరం విమానాశ్రయం అథారిటీ సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపేశారు.

అయితే, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో విమానంలో 63 మంది ప్రయాణికులు… వారిలో గన్నవరంలో 19 మంది ప్రయాణికులు దిగారు. మిగిలిన 45 మంది ప్రయాణికులు తిరుచ్చానూరు వెళ్లవల్సి ఉంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







