అబుధాబి: అత్యాచారయత్నం కేసులో ముగ్గురికి జీవిత ఖైదు విధించిన కోర్టు
- February 20, 2021
అబుధాబి:అత్యాచార యత్నం, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన కేసులో ముగ్గురు దోషులకు అబుధాబి క్రిమినల్ కోర్టు యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. కోర్టు విచారణలో వెల్లడైన అంశాల మేరకు ఈ ఘటన ఏడారిలోని ఓ రిమోట్ ఏరియాలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న దోషులు ముగ్గురు ఎమ్.ఎమ్, ఎస్.ఎమ్, ఏఎస్ తమను ఒక్కసారిగా ముట్టడించినట్లు బాధితురాలు తమ ఫిర్యాదులో పేర్కొంది. అక్కడే ఉన్న ఓ వ్యక్తిని ఇద్దరు కత్తులతో బెదిరించగా, మూడో వ్యక్తి బాధితురాలిపై అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు ప్రతిఘటించటంతో మిగిలిన ఇద్దరు వ్యక్తులు కూడా అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. అయితే..ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న ఇంకో బాధితుడు పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాము రావటం గమనించిన దోషులు తప్పించుకునేందుకు ప్రయత్నించారని, అయినా..వేటాడి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రయత్నంలో తమ వాహనాన్ని కూడా డ్యామేజ్ చేశారని అన్నారు. కేసు విచారణలో దోషులు నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ కావటంతో పలు సెక్షన్ల కింద గరిష్ట శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం. మొదటి దోషి ఎమ్.ఎమ్ కి 1,10,000 దిర్హామ్ ల ఫైన్ విధించింది. మిగిలిన ఇద్దరు దోషులు ఎస్.ఎమ్, ఏఎస్ లకు చెరో 50,000 దిర్హామ్ ల ఫైన్ విధించింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







