ఇండియా విమానాల్లో పిల్లలకు పీసీఆర్ కోవిడ్ టెస్ట్ తప్పనిసరి
- February 22, 2021
యూఏఈ:ఇండియాకి వచ్చే అన్ని విమానాల్లో పిల్లలకు పిసిఆర్ టెస్ట్ ఫిబ్రవరి 22 నుంచి తప్పనిసరి చేశారు. అన్ని వయసులకు చెందిన పిల్లలకూ ఇది తప్పనిసరి చేయడం జరిగింది. ఈ మేరకు న్యూ డిల్లీ ఎయిర్ పోర్టులో ఎఫ్ఎక్యు పబ్లిష్ చేయడం జరిగింది.యూఏఈ ఈ విషయాన్ని ధృవీకరించింది.కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త మ్యుటేషన్ల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. పిసిఆర్ టెస్ట్ ప్రయాణీకులందరికీ తప్పనిసరి.కుటుంబ సభ్యుల మరణం నేపథ్యంలో వచ్చేవారికి మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపునిస్తారు.అలాంటి వ్యక్తులు 72 గంటల ముందుగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని పోర్టల్‌లో పొందుపర్చుతారు.పిసిఆర్ నెగెటివ్ టెస్ట్ రిపోర్టుని ప్రయాణీకులంతా సమర్పించాల్సి వుంటుంది. కాగా, యూకే, యూరోప్, బ్రెజిల్ మరియు ఆఫ్రికా నుంచి వచ్చేవారికి ప్రత్యేక ప్రోటోకాల్ వుంటుంది.పిసిఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ సమర్పించినవారు 14 రోజులపాటు తమ ఆరోగ్యాన్ని స్వయంగా మానిటర్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







