ఐపీఎల్ వేదికలు ఖరారు...

- February 22, 2021 , by Maagulf
ఐపీఎల్ వేదికలు ఖరారు...

ఐపీఎల్ 2021 మినీ వేలం ముగియడంతో టోర్నీ కోసం ఏయే వేదికలను ఎంపిక చేయాలన్న పనిలో పడింది బీసీసీఐ.ఇప్పటికే ఐపీఎల్ 14వ సీజన్‌ను స్వదేశంలో నిర్వహిస్తామని బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముంబై, అహ్మదాబాద్‌లను వేదికలుగా ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం.గ్రూప్ దశలో నిర్వహించే మ్యాచ్‌లను ముంబైలోని నాలుగు స్టేడియాల్లో.. ప్లేఆఫ్స్, ఫైనల్‌కు అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం కేటాయించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఐపీఎల్ 2021ను ఏప్రిల్ మధ్య వారంలో ప్రారంభించాలని భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com