వన్ నేషన్.. వన్ హెల్త్ కార్డ్
- February 22, 2021
న్యూ ఢిల్లీ:మోదీ సర్కార్ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ (NDHM) ప్రారంభించింది. వన్ నేషన్, వన్ హెల్త్ కార్డ్ భారతీయులందరికీ ఆరోగ్య కార్డులను డిజిటలైజ్ చేస్తోంది.పేషెంట్ల డేటాను ఒకే కార్డులో పొందుపరుస్తారు.దీనిని ఎంచుకున్న వ్యక్తులకు ప్రత్యేకపమైన హెల్త్ ఐడీ కార్డు కేటాయించబడుతుంది. అనారోగ్య ఇబ్బందులు తలెత్తినప్పుడు తట్టుకునేందుకు ఎన్నో బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.కానీ పదుల సంఖ్యలో లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు ఉండడంతో పాటు ఒకే రకం పాలసీలోనూ వేర్వేరు నిబంధనలు.. వీటన్నింటినీ అధిగమించి ప్రతి విభాగంలోనూ ఒక ప్రామాణిక పాలసీని తీసుకురావాలని irdai పలు పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. ఆరోగ్య బీమా పాలసీల ఎంపికలో గందరగోళాన్ని తొలగించడమే దీని ప్రధాన లక్ష్యం.
కరోనా తర్వాత జీవిత, ఆరోగ్య బీమా పాలసీల అవసరాన్ని గుర్తిస్తున్నారు. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు డిమాండ్ పెరిగింది. కానీ ఈ పాలసీలో చోటు చేసుకున్న నిబంధనలు పాలసీదారులకు ఇబ్బందిగా మారాయి. కరోనా చికిత్సకు సంబంధించి హెల్త్ బీమా పాలసీల్లో స్పష్టత లేకపోవడంతో పరిహారం ఇవ్వడానికి బీమా సంస్థలు నిరాకరిందాయి. దీంతో irdai రంగంలోకి దిగింది. కరోనా చికిత్సకు పరిహారం ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. అన్ని బీమా సంస్థలు ఈ పాలసీలను అందిచాలను మార్గదర్శకాలు జారీ చేసింది. ఆరోగ్య సంజీవని పేరుతో మరో ప్రామాణిక ఆరోగ్య పాలసీని అందించాలని జనరల్ ఇన్సూరన్స్ కంపెనీలకు సూచించింది. గరిష్టంగా రూ.5 లక్షల వరకు ఈ పాలసీ కింద అందించాలని తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







