దుబాయ్: కోవిడ్ రూల్స్ పాటించని వారిపై ఇలా ఫిర్యాదు చేయండి..

దుబాయ్: కోవిడ్ రూల్స్ పాటించని వారిపై ఇలా ఫిర్యాదు చేయండి..

దుబాయ్:కోవిడ్ మహమ్మారి ప్రపంచానికి చేస్తున్న నష్టం మన స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాది కాలంలో లక్షల మంది ప్రాణాలు కొల్పోయారు. అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కొల్పోవాల్సి వచ్చింది. వ్యాపార రంగం సంక్షోభంలో చిక్కుకుంది. అందుకే కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రపంచ దేశాలన్ని శాయశక్తులా కృషి చేస్తున్నాయి. మరి సమాజ ఆరోగ్య భద్రతకు మనం ఏం చేస్తున్నాం? వైరస్ మహమ్మారి నుంచి మన చుట్టు ఉన్న వారిని రక్షించటం అంటే మనల్ని మనమే రక్షించుకోవటం. అందుకే కోవిడ్ నిబంధనలను మనం పాటించటమే కాకుండా..మన చుట్టు పక్కల వాళ్లు కూడా పాటించేలా చేయాల్సిన అవసరం ఉందన్నది దుబాయ్ అధికారుల వాదన. ఎక్కడైనా సరే కోవిడ్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారు కనిపిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. హాట్ లైన్ నెంబర్ 901కి కాల్ చేసి తర్వాత 8 నెంబర్ ను ఎంపిక చేసుకోవటం ద్వారా పౌరులు తమ ఫిర్యాదును నమోదు చేయవచ్చని వివరించారు. లేదంటే దుబాయ్ పోలీస్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. రెస్టారెంట్లో కోవిడ్ నిబంధనలు పాటించటం లేదని గుర్తించిన ఓ వ్యక్తి ఇటీవలె తమకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారంటూ దానికి సంబంధించి వీడియోను ట్వీటర్ లో పోస్ట్ చేశారు పోలీసులు. ఎక్కువగా రెస్టారెంట్లు, సెలూన్లలో కోవిడ్ రూల్స్ బ్రేక్ చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. హాట్ లైన్ 901 ద్వారా తాము 24 గంటల పాటు సేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. సమాజ ఆరోగ్య భద్రతే తమ భద్రతగా ప్రజలు భావించి కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయటం తమ వంతు బాధ్యతగా ప్రజలు భావించాలని పోలీసులు కోరారు. 

Back to Top