రియాద్: ఆన్ లైన్ ద్వారా న్యాయవాద కోర్సుల శిక్షణ

రియాద్: ఆన్ లైన్ ద్వారా న్యాయవాద కోర్సుల శిక్షణ

రియాద్:న్యాయ వాద కోర్సులకు సంబంధించిన శిక్షణను ఆన్ లైన్ ద్వారా అందించేందుకు ఈ పోర్టల్ ను ప్రారంభించింది సౌదీ ప్రభుత్వం. న్యాయ శాఖ మంత్రి డాక్టర్ వలిద్ బిన్ మొహమ్మద్ అల్ సమానీ జస్టిస్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ట్రైనింగ్ లో ఆన్ లైన్ పోర్టల్, ట్రైనింగ్ ప్లాట్ ఫాంతో పాటు మొబైల్ యాప్ మిళితమై ఉంటాయి. పోర్టల్ ద్వారా చట్ట, న్యాయ పరమైన పలు సందేహాలు, సమస్యలపై అభ్యర్ధులకు విస్తృతమైన శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే ట్రైనింగ్ మేనేజ్మెంట్ తో పాటు ఆన్ లైన్ పరీక్షలను కూడా నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పోర్టల్ ద్వారా అభ్యర్ధులకు నాణ్యమైన శిక్షణ అందుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 

Back to Top