రెండ్రోజుల్లో కువైట్ చేరుకున్న 1,442 మంది ప్రయాణికులు

రెండ్రోజుల్లో కువైట్ చేరుకున్న 1,442 మంది ప్రయాణికులు

కువైట్ సిటీ:విమానాశ్రయం తిరిగి ప్రారంభమయ్యాక 48 గంటల్లోనే 1,442 మంది ప్రయాణికులు దేశానికి చేరుకున్నట్లు కువైట్ ప్రకటించింది. 48 గంటల్లో 48 విమానాలు కువైట్ విమానాశ్రయానికి చేరుకున్నాయని, దేశానికి చేరుకున్న 1,442 మంది ప్రయాణికుల్లో 989 పౌరులు, 453 మంది గృహ కార్మికులు ఉన్నారని వెల్లడించింది. విమాన సర్వీసులు ప్రారంభం అయిన తొలి రోజున 25 విమానాల్లో 713 మంది ప్రయాణికులు, రెండో రోజున 22 విమానాల్లో 729 మంది ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయని వివరించింది. కువైట్ వస్తున్న ప్రయాణికుల్లో ఎక్కువ మంది టర్కి, ఇండియన్లు ఉన్నారని తెలిపింది. కువైట్ పౌరులు కువైట్ మొసఫర్, డొమస్టిక్ వర్కర్లు బెల్ సలామ్ ద్వారా ముందస్తుగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత దేశానికి చేరుకున్నారని వెల్లడించింది. అయితే..ఇతర దేశాల నుంచి కువైట్ చేరుకుంటున్న ప్రతి ఒక్కరికి పీసీఆర్ టెస్టులు నిర్వహించి క్వారంటైన్ తరలిస్తున్నామని తెలిపింది. క్వారంటైన్ కోసం పలు హోటల్స్ ని కేటాయించినట్లు కువైట్ వివరించింది. 

 

Back to Top