ఏపీలో కరోనా కేసుల వివరాలు

ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏపీలో  గడచిన 24 గంటల్లో 28,268 కరోనా పరీక్షలు నిర్వహించగా 70 మందికి పాజిటివ్ అని వెల్లడైంది.చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 18 కొత్త కేసులు వెలుగు చూశాయి. విశాఖ జిల్లాలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 9 కేసులు గుర్తించారు. కర్నూలు జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. కడప జిల్లాలో 1, ప్రకాశం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో 84 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది.ఈ మరణం విశాఖ జిల్లాలో నమోదైంది.దాంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,168కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,89,409 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,81,666 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం కరోనా చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 575కి తగ్గింది.

Back to Top