యూఏఈ చేరుకుంటున్న ప్రయాణికుల్లో 0.7% మందికి కోవిడ్ పాజిటివ్
- February 24, 2021
యూఏఈ:పలు దేశాల నుంచి యూఏఈ చేరుకుంటున్న వారిలో 0.7 శాతం మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అవుతోందని కింగ్డమ్ ఉన్నతాధికారులు ప్రకటించారు. విమాన సర్వీసులు పున:ప్రారంభం అయన నాటి నుంచి ఇప్పటివరకు యూఏకి 27 లక్షల మంది ప్రయాణికులు చేరుకున్నారని వెల్లడించారు. అయితే..వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తాము ప్రపంచ ప్రమాణాలు పాటిస్తున్నామని తెలిపారు. పలు దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా వైరస్ విస్తరించకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఇతర సంస్థల మార్గనిర్దేశకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, విమాన ప్రయాణికులు ఫ్లైట్ ఎక్కే ముందే పీసీఆర్ రిపోర్ట్ చెక్ చేయటంతో పాటు, యూఏఈ చేరుకున్నాక మరోసారి పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తున్నామని వివరించారు. అలాగే ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి చేశామన్నారు. పీసీఆర్ టెస్టుల నిర్వహణ కోసం అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్న ల్యాబులకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని, ఎవరైనా క్వాలిటీ విషయంలో రాజీ పడినా, నిబంధనలు ఉల్లంఘించినా ఆయా టెస్ట్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అంతేకాదు..విమాన సిబ్బంది విషయంలోనూ తగు జాగ్రత్తలు పాటిస్తున్నామన్నారు. ఏవియేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఫ్రంట్ లైన్ సిబ్బందిలో ఇప్పటికే 70 శాతం మందికి వ్యాక్సిన్ అందించామని, సిబ్బందికి వైద్య సేవలు అందించేందుకు ప్రపంచంలోనే తొలి మొబైల్ సెంటర్ ను యూఏఈ ఏర్పాటు చేసిందన్నారు.
తాజా వార్తలు
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!